రానా పెళ్లి పత్రిక చూసారా..?

భల్లాల దేవా ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతుండడం తో అభిమానులతో పాటు సినీ స్టార్స్ సైతం సంబరాలు చేసుకుంటున్నారు. తాను ప్రేమించిన మిహీకా బజాజ్‌ ను ఆగస్టు 08 న వివాహం చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం కరోనా స్థాయి తీవ్రస్థాయి లో ఉండడం తో వివాహ వేడుక రద్దై అవకాశాలు ఉండబోతాయనే వార్తలు ప్రచారం అయినప్పటికీ ఆ ప్రచారం ఏ మాత్రం నిజం లేదని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఇరు కుటుంబాలు అనుకున్న ఆ తేదీ ఆగస్టు 8నే పెళ్లి వేడుక జరగనుందని పేర్కొంటూ ఓ‌ పెళ్లి పత్రికను అందరి ముందుంచారు. ఈ వివాహ పత్రికను వీడియో రూపంలో ఎంతో అద్భుతంగా డిజైన్ చేయడం విశేషం. పౌరాణికం థీమ్‌ తీసుకొని పాత చిత్రం మాయాబజార్’లోని సన్నివేశాన్ని జత చేస్తూ రానా, మిహికాల ఫొటోలతో ఆసక్తికరంగా రూపొందించారు. ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, చైతన్య ఎన్‌క్లేవ్, ఖాజాగూడ, మణికొండ, హైదరాబాద్‌లో రానా- మిహికా వివాహం జరుగుతుందని ఈ పత్రిక ద్వారా వెల్లడించారు. అయితే కరోనా విలయతాండం చేస్తున్న కారణంగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే రానా వివాహ వేడుక జరగనుందని తెలుస్తోంది.