వెబ్ సీరీస్ చేస్తూ ఫెమస్ అయిన నవీన్ పోలిశెట్టి.. తెలుగులో హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో పరిచయమయ్యాడు. ఈ సినిమా మొదటి రోజు మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకుని సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా హిందీ లో రీమేక్ అవుతుంది.
తాజాగా ఈ చిత్రం రీమేక్ హక్కులు రెండు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. అయితే బడ్జెట్ కన్నా రెట్టింపు డబ్బులకు రీమేక్ హక్కులు పలకడం విశేషం. గతేడాది జూన్ 21న విడుదలయ్యింది. కాగా ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఆరు కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్.. ఇందులో వన్ మ్యాన్ షోగా నటించాడు. ఇక త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాకి స్వరూప్ ఆర్ ఎస్ జే దర్శకత్వం వహించగా.. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ సంస్థపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు.