ఎన్టీఆర్ అభిమానులకు ఈ ఏడాది తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. అరవింద సమేత తర్వాత గ్యాప్ తీసుకొని రాజమౌళి డైరెక్షన్లో మల్టీస్టారర్ చిత్రానికి ఓకే చెప్పడం తో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఈ సినిమా మొదలైనప్పటి నుండి అనేక అవాంతరాలు ఎదురువుతూనే ఉన్నాయి. సినిమా షూటింగ్ ఆలస్యం కావడం , అన్ని సెట్ అయ్యాయి అనుకునేలోపు కరోనా రావడం తో ఈ సినిమా ఈ ఏడాదిలో సెట్స్ పైకి వాస్తుదో రాదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇప్పట్లో రావడం కష్టమే అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదలకు కావలసిన మెటీరియల్ తమ వద్ద లేదని, ఫస్ట్ లుక్ అందించలేమని ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఫ్యాన్స్ కి సంజాయిషీ ఇచ్చారు. ఐతే లాక్ డౌన్ అనంతరం షూటింగ్ మొదలైన తరువాత ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే షూటింగ్ మొదలు అవ్వడం కష్టమే అనిపిస్తుండడం తో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.