కరోనా టైం లో తమన్నా ఎక్కడికి వెళ్లిందో తెలుసా..?

లాక్ డౌన్ కారణంగా చిత్ర సీమా నటీనటులకు ఫుల్ రెస్ట్ దొరికింది. ఎప్పుడు షూటింగ్ లతో బిజీ బిజీ గా గడిపే వీరంతా ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో హ్యాపీ గా గడుపుతున్నారు. తాజాగా తమన్నా క‌రోనా ప్ర‌భావంతో ఫ్రీ టైం దొరికింది. బిజీ షెడ్యూల్ కు దూరంగా ఉన్న త‌మ‌న్నా త‌న‌కిష్ట‌మైన కోరిక‌ల‌ను తీర్చుకునే ప‌నిలో ప‌డింది.

అందుకు ఈ ఫొటోనే ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించే ప‌నిలో ప‌డింది. థానేలో ప్ర‌ముఖ ప‌ర్యాట‌క స్థ‌లం అసంగావ్ మ‌హులి పోర్టును సంద‌ర్శించింది. పోర్టు ప‌రిసర ప్రాంతాలను కాలిన‌డ‌కన అధిరోహించింది. అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న‌పుడు దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.