కమల్ కూతురి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన శృతి హాసన్..కెరియర్ మొదట్లోనే ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకొని..ఆ తర్వాత గోల్డెన్ గా లెగ్ మారింది. వరుస సక్సెస్ లు అమ్మడిని పలకరించడం తో అగ్ర హీరోల ఛాన్సులు తలుపు తట్టాయి. కానీ అమ్మడు మాత్రం వాటిని కాదని ప్రేమలో పడి సినిమాలకు దూరం అయ్యింది. ఇక ప్రేమ విఫలం కావడం తో మళ్లీ సినిమాల ఫై ఫోకస్ పెట్టింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘యారా’ ఓటీటీ ద్వారా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానున్నది.
ఈ సినిమాలో తాను వృద్ధురాలిగా నటిస్తున్నట్లు శృతిహాసన్ తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘1970, 90 కాలాల వ్యవధుల్లో ఈ కథ సాగుతుంది. 1990 ఎపిసోడ్స్‌లో వృద్ధురాలిగా కనిపిస్తా. వయసుకు మించిన పాత్రలు చేయడం ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుంది. వృద్ధురాలిగా నటించడం నా కెరీర్లో తొలిసారి కావడంతో పాత్ర విషయంలో చాలా పరిశోధన చేశా. దుస్తులు, హావభావాలు,నడక తీరుతో పాటు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా. నా సినీ ప్రయాణంలో ఎక్కువగా శ్రమించి చేసిన పాత్రల్లో ఇదొకటి. నాలోని నటనాప్రతిభకు అసలైన పరీక్షగా నిలిచిన ఈ పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేశాననే నమ్మకముంది’ అని తెలిపింది. థిగ్మన్షు ధులియా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్, విజయ్ వర్మ కీలక పాత్రల్ని పోషించారు. ప్రస్తుతం తెలుగు లో రవితేజ సరసన క్రాక్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.