వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. వైరస్ నిర్థారణ అయ్యిందట. దీనికి బలం చేకూరుస్తూ ఆయన కూడా ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాను సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. విజయసాయి కరోనా బారిన పడడం ఫై బుద్ధా సెటైర్లు వేశారు.
విశాఖ కేజీహెచ్‌లో ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లడమేంటని ప్రశ్నించారు. అసలు ఇది కరోనా పాజిటివా? వివేక హత్య కేసులో సీబీఐ పాజిటివా? అని ప్రశ్నించారు. ‘‘అదేంటి హైదరాబాద్ పారిపోయారా? కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారా విజయసాయిరెడ్డి గారు. ఓహో అల్లుడు పాలన మీద నమ్మకం లేదా? గుండ్రాయిలా ఉన్న అచ్చెన్నకి కార్పొరేట్ వైద్యం ఎందుకు.. ఈఎస్ఐ ఉండగా అని ఒక బీసీ నాయకుడిని అవమానిస్తూ మీ రాక్షస మనస్తత్వం బయటపెట్టారు. మరి మీరు విశాఖలో కేజీహెచ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లడం ఏంటి? అన్నట్టు ఇది కరోనా పాజిటివా? వివేకా గారి కేసులో సీబీఐ పాజిటివా? ఆయన హత్యకు గురైనప్పుడు మీరు సంభ్రమాశ్చర్యాలకు గురైయ్యారు గుర్తుందా?’’ అని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.