సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార నిన్న 8 వ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్భాంగా సోషల్ మీడియా లో మహేష్ అభిమానులు , ఘట్టమనేని అభిమానులు సితార కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ సందర్భంగా మహేష్ ఆయన భార్య నమ్రత , కుమారుడు గౌతమ్ సోషల్ మీడియా ద్వారా సితారకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..
సితార బర్త్‌డే సందర్భంగా మహేష్ తన ట్విట్టర్లో కూతురితో గడిపిన ఆనందక్షణాలకి సంబంధించిన ఫోటోస్‌ని వీడియో రూపంలోకి మార్చి షేర్ చేశాడు.
సితారకి 8 ఏళ్ళు. ఎంత స్పీడ్‌గా ఎదుగుతుందో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. ఈ విషయం ఎప్పటికీ తెలియదు. జన్మదిన శుభాకాంక్షలు సితార అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు మహేష్. బర్త్‌డే సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ అన్నదానం చేశారు. కొందరు మాస్క్‌లు, శానిటైజర్లు పంచారు. కేక్ కట్ చేసి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకి మహేష్ బాబు టీం కృతజ్ఞతలు తెలియజేసింది. కొన్నేళ్ళుగా సితార పాపపై మీరు చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు. కరోనా సంక్షోభంలో మీరు చేస్తున్న సామాజిక కార్యక్రమాలని అభినందిస్తున్నాం అని అన్నారు.
A Wholehearted thanks to all the fans for showering their immense love for Sitara papa. We truly appreciate the good deeds you do in-spite of the pandemic. We hope you all stay safe!???@urstrulyMahesh pic.twitter.com/nzGtWTAt2I— Team Mahesh Babu (@MBofficialTeam) July 21, 2020