ఆనందో బ్రహ్మ’ చిత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ మహి రాఘవ..తాజాగా దివంగత నేత వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమాను తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. తక్కువ బడ్జెట్ తో తాను చెప్పాలనుకున్నది కరెక్ట్ గా చెప్పి అభిమానులను ఆకట్టుకున్నాడు. మహి టాలెంట్ ను గుర్తించిన చాలామంది ఆయనతో సినిమాలు చేయాలనీ అనుకుంటున్నారు.
అందులో బన్నీ కూడా ఉన్నాడనే వార్తలు ఆ మధ్య వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయనున్నాడని..బన్నీ కి స్టోరీ లైన్ చెప్పగా..స్క్రిఫ్ట్ ను డెవలప్ చేయమని బన్నీ డైరెక్టర్ మహికి సూచింనట్టు టాక్. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడని గాసిప్ చక్కర్లు కొడుతోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ తరహా పాత్రలో సమాజంలోని పలు అంశాలను స్మృశిస్తూ కమర్షియల్ హంగులతో ఈ సినిమా ఉండనుందని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరి అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడనే వార్త ఎంతవరకు నిజమనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.