తెలంగాణ ప్రజలకు హెచ్చరిక

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖా హెచ్చరిక జారీచేసింది. బుధ, గురువారాల్లో అంటే జులై 22, 23 తేదీల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖా తెలిపింది. సీనియర్ సైంటిస్టు రాజారావు చెబుతున్న వివరాల ప్రకారం నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతోపాటు దక్షిణ భారత రాష్ట్రాలపై రెండు భూ ఉపరితల ద్రోణులు ఏర్పడడం వల్ల తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం వుందని తెలుస్తోంది.

నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతూ వుండడంతో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ విభాగం పేర్కొంది. దక్షిణ ఇంటీరియర్ కర్నాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉత్తర ఇంటీరియర్ కర్నాటక ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం కలిసి వర్షాలు కురిసేందుకు కారణమవుతున్నాయిన వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు చెప్పుకొచ్చారు.