కరోనా నుండి బయటపడ్డ అక్కకు చెల్లి ఎలా వెల్ కం చెప్పిందో చూడండి

దేశ వ్యాప్తగా కరోనా ఉదృతి నడుస్తుంది. ఎవరికీ ఉందొ..ఎవరికీ లేదో అర్థంకాని పరిస్థితి. కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఏమితెలియని వారు సైతం దీనిబారిన పడుతున్నారు. కొంతమంది క్షేమంగా ఇంటికి వస్తుండగా..మరికొంతమంది దీనికి బలవుతున్నారు. తాజాగా తన అక్క ఈ మహమ్మారి నుండి కేశంగా బయటపడడం తో ఆ చెల్లి సంతోషం మాములుగా లేదు. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన చోటుచేసుకుంది.

23 ఏళ్ల సలోనీ… తన వీధిలో రోడ్డుపై అదిరిపోయే స్టెప్స్ వేసింది. కరోనా పాజిటివ్‌గా తేలి… ఐసోలేషన్‌లో ఉండి… కరోనాను జయించి తిరిగి ఇంటికి వచ్చిన అక్కకు గ్రాండ్ వెల్‌కం చెప్పింది. హాత్ జా రే చోక్రే పాటకు స్టెప్పులేసింది. ఐతే… ఈ డాన్స్… తన అక్కకు వెల్‌కం చెప్పడానికి మాత్రమే కాదు. కష్టకాలంలో… తమ కుటుంబానికి ఏమాత్రం సాయం చెయ్యని చుట్టుపక్కల వారికి చెంపపెట్టులా భావిస్తూ ఈ డాన్స్ చేసినట్లు సలోనీ చెప్పింది.

This video gave me immense positivity.

Corona positive person returning home after beating the disease ?♥️?? pic.twitter.com/QJRiiI0aVi— Godman Chikna (@Madan_Chikna) July 18, 2020