గత కొన్ని నెలలుగా సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు సినిమా చేయాలనీ నాగ్ చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ షో తర్వాత నాగ్ ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడని అంత అనుకున్నారు. కానీ ఎందుకో సినిమా సెట్స్ పైకి రాలేదు.
తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త బయటకు వచ్చింది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టగానే బంగార్రాజు చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని నాగ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. తక్కువ టైంలోనే షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అంతేకాదు పస్ట్ పార్టుకు సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ తో ఈ చిత్రం కోసం ట్యూన్స్ కూడా రెడీ చేసే పనిలో ఉందట నాగ్ అండ్ టీం.