రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు.
ఈరోజు రష్మిక ఛాలెంజ్ రాశిఖన్నా పూర్తి చేసింది. తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటినట్లు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలిపింది. ఈ సందర్భంగా ప్రముఖ హీరోయిన్లు… రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ అలాగే తమన్నాలకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నట్లు, వారు దీనిని స్వీకరించి మొక్కలను నాటి ఇదేవిధంగా ముందుకు కొనసాగించాలని పిలుపునిచ్చింది. అలాగే నటి శిల్పా రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఫిలింనగర్ లోని తన నివాసం లో కూతురితో కలిసి మొక్కలు నాటింది మంచు లక్ష్మి.
అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరూ స్వీకరిస్తూ మొక్కలు నాటాలని తెలుపుతూ ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు. తను మరో ముగ్గురు నీరజ డిసైనర్, సంధ్య డాన్సర్ , సందీప్ కిషన్ లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు