దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతం అవుతున్నాయి..ఎవరికీ ఉందొ ఎవరికీ లేదో..ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో అర్ధం కానీ పరిస్థితి నెలకొని ఉంది. దీంతో ప్రజలు భయం భయం గా బ్రతుకుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. తమ్ముడికి కరోనా వచ్చిందని అన్న ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.
వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్రం కోలార్ గాంధీనగర్ కాలనీలో నివాసముంటున్న 37 ఏళ్ల వ్యక్తి తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే కొన్నాళ్ళగా అతను ఇంటికే పరిమితం అయ్యాడు. ఇక లాక్ డౌన్ సడలించిన క్రమంలో అతడి తమ్ముడికి కరోనా వైరస్ సోకింది. ఈ క్రమంలో దీంతో ఆరోగ్య శాఖ అధికారులు అతన్ని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. అయితే తన ఇంట్లోనే ఉన్న తమ్ముడికి సోకిన కరోనా తనకు కూడా సోకి ఉంటుందేమోనని ఆ వ్యక్తి తీవ్ర భయాందోళనకు గురయ్యాడని చెబుతున్నారు. దీంతో రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. అటు తమ్ముడు కరోనాతో ఆస్పత్రిలో ఉంటే మరో పక్క అన్న ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.