ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ పదవులు వీరికేనా..

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులకు జగన్ ఇద్దరు నేతల పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ పదవులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పదవుల్లో ఒక పదవిని ఎస్‌సీ సామాజిక వర్గానికి మరో పదవిని మైనార్టీలకు ఇవ్వాలని వైసీపీ సర్కార్ నిర్ణయంం తీసుకుందని అంటున్నారు.

వారిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పండుల రవీంద్రబాబు, మైనార్టీ వర్గానికి చెందిన జకియా ఖానుంల పేర్లను ప్రభుత్వం గవర్నర్ ప్రతిపాదించే అవకాశం ఉందట. 2019 ఎన్నికల ముందు అప్పట్లో టీడీపీ ఎంపీగా ఉన్న ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరారు. అయితే అప్పుడే ఎంపీ టికెట్ ఇవ్వమని చెప్పడంతో పాటు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు ఆయనకు ఈ పదవి ఇస్తున్నట్టు చెబుతున్నారు.