తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా విలయతాండవం ఎక్కువ అవుతుందే తప్ప తగ్గడం లేదు. మొన్నటి వరకు పల్లెల్లో కరోనా ఛాయలు కనిపించకపోయినా..ప్రస్తుతం అక్కడ కూడా కరోనా విజృభిస్తుంది. ప్రతి రోజు వందల సంఖ్య లో కేసులు నమోదు అవుతుండడం తో రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
తాజాగా వరంగల్ మేయర్ కరోనా బారిన పడ్డారు. మేయర్ గుండా ప్రకాశ్ సహా అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ క్రమంలో మేయర్ దంపతులకు కరోనా రావడం స్థానికంగా అలజడి రేపుతోంది. దీంతో నగర రాజకీయ నేతలు ముఖ్యంగా మేయర్‌తో సన్నిహితంగా ఉన్నవారిలో ఆందోళన నెలకొంది. మేయర్ దంపతులతో పాటు, గన్‌మెన్, ఇతర సిబ్బంది హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, పలువురు కార్పొరేటర్లు కూడా క్వారంటైన్లో ఉన్నారు. గత పదిరోజులుగా మేయర్‌తో కలిసి ఉండి, సన్నిహితంగా మెలిగిన నేతలు, కార్యకర్తలు పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారులు వారికి సూచించారు.