సజ్జలపై నమ్మకం కోల్పోయిన జగన్ !

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై  ఏపీ సిఎం  జగన్ మోహన్  రెడ్డి నమ్మకం కోల్పోయారా ?  అంటే అవుననే వినిపిస్తోంది. జగన్ తీసుకున్న తాజా నిర్ణయం దీనికి అద్దం పడుతుంది.  పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై జగన్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ముగ్గురు ముఖ్య నేతలకు పార్టీ బాధ్యతలను అప్పగించారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల భాద్యతని ఉంచారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి… ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల పార్టీ భాద్యతలు..  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని నిర్ణయం తీసుకున్నారు జగన్.    

ఐతే ఇందులో సజ్జలకు ఐదు జిల్లాలు ఇవ్వడంతో పార్టీలో ఆయన బలం పెరిగిందని మాట్లాడుకున్నాయి పొలిటికల్ వర్గాలు. ఐతే ఇప్పుడు సజ్జల పవర్స్ కట్ చేశారు జగన్. ఇప్పటి వరకు సజ్జల పర్యవేక్షణలో ఉన్న ప్రకాశం, కర్నూలు జిల్లా బాధ్యతల నుండి ఆయన్ని తొలగించారు జగన్. ఆ జిల్లా బాధ్యతలను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు. 

ఐతే దీని వెనుక కారణం .. సజ్జలపై జగన్ నమ్మకం కోల్పోయారనే ప్రచారం పార్టీలో జరుగుతుంది. ఐదు జిల్లాలు సజ్జలకు ఇచ్చిన జగన్ .. అప్పుడే రెండు జిల్లాల నుండి ఆయన్ని తొలగించారు. భాద్యతలు ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం.. సజ్జల సామర్ధ్యంపై నమ్మకం కుదరకపోవడమని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. సజ్జలకు ఐదు జిల్లాలు ఇవ్వడంతో పార్టీలో కీలకంగా వున్న ఎంపీ విజయసాయి రెడ్డిని పక్కకు  జరిపినట్లయిందని కొందరు మాట్లాడారు. ఇప్పుడు అవి పసలేని మాటలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు సజ్జల నుండి పవర్స్ కట్ చేశారు జగన్. ఈ చర్యతో సజ్జలకు పార్టీలో అంత సీన్ లేదని, అదే సమయంలో విజయసాయిని పక్కకు జరిపారన్న ప్రచారమూ అవాస్తవమేనని జగన్ స్వయంగా తన చర్యతో చెప్పినట్లయిందని రాజకీయ విశ్లేషకుల మాట.