ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే . సామాన్య ప్రజలకే కాక రాజకీయ నేతలకు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు కరోనా సోకగా..తాజాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా అనుమానంతో ఆయన టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
ఇక ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడ్డారు. ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ రావటంతో ఆయనను కలిసిన కార్యకర్తలు, సన్నిహితుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం అధికారులు ఎమ్మెల్యేను కలిసిన వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు.