రీసెంట్ గా బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫామిలీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. బిగ్ తో పాటు కుమారుడు , కోడలు , మనవరాలు ఇలా అందరికి వైరస్ సోకింది. బిగ్ బి , అభిషేక్ ముంబై లోని నానావతి హాస్పటల్ లో కరోనా చికిత్స తీసుకుంటుండగా..ఐశ్వర్యారాయ్, ఆమె కూతురు మాత్రం వారం రోజులుగా ఇంట్లో చికిత్స తీసుకుంటూ వచ్చారు.
కానీ రోజు రోజుకు కరోనా లక్షణాలు పెరుగుతుండడం తో వారు కూడా హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం నలుగురు నానావతిలోనే చికిత్స తీసుకుంటున్నారు.