మొత్తానికి రకుల్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. గత మూడు నెలలుగా లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లిన ఈ భామ ఈరోజు హైదరాబాద్ కు వచ్చి తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సమీపంలో రకుల్ సొంత ఇల్లు ఉన్న విషయం విదితమే.
ప్రస్తుతం తన సోదరునితో కలిసి ఇక్కడే నివసించేందుకు ఆమె నిర్ణయించుకున్నది. ప్రస్తుతం ఢిల్లీ కంటే హైదరాబాద్ లో నివసించడం సేఫ్ అని రకుల్ పేర్కొంటుంది. హైదరాబాద్ లో ఉంటె తనకు ఉన్న ఎఫ్ 45 జిమ్ వ్యవహారాలను కూడా చూసుకోవడానికి వీలు ఉంటుందని చెప్పుకొచ్చింది.