‘ఎంఐఎం’కు మద్దతు నహీ : తలసాని

talasani-srinivas-yadavస్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు ఇవ్వడంలేదని టీడీపీ సీనియర్ నేత, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పార్టీలోని మైనార్టీ నాయకులతో చర్చించిన అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో ఎంఐఎం తెగతెంపులు చేసుకున్న అనంతరం.. ఆ పార్టీ తెరాస, వైకాపాలలతో దోస్తీ కట్టవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే శాసనసభలో తెరాస ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణానికి వైకాపా మద్దతు ప్రకటించినప్పటికినీ ఎంఐఎం తటస్థంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో.. ఎంఐఎం తెదేపాతో జతకట్టే అవకాశాలున్నట్లు వార్తలొచ్చాయి. ఆ ఊహాగానాలకు ఊతమిచ్చే విధంగా ఎంఐఎం కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా మద్దతు కోరడంతో.. ఆ రెండు పార్టీలు జతకట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ పండితులు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా తెదేపా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తలసాని ఎంఐఎంతో జతకట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేయడం రాజకీవర్గాలల్లో హాట్ టాపిక్ గా మారింది.