హైదరాబాద్ మహానగరం లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు వందల కేసులు కేవలం GHMC పరిధిలోనే నమోదు అవుతుండడం తో నగర వాసులు భయపడుతున్నారు. ఇప్పటికే ఈ కరోనా వైరస్ ప్రతి రంగాలవారికి రాగ ..తాజాగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి సోకింది.
శ్వేతా మహంతి గత ఐదురులుగా కలెక్టరేట్‌కు రావడం లేదు. ఈ క్రమంలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. కలెక్టర్ శ్వేతా మహంతితో పాటు డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో మొత్తం 15 మంది సిబ్బందికి సైతం కరోనా సోకినట్టుగా సమాచారం.