కొత్త జిల్లాలపై కమిటీ

జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రత్యేక కమిటీని నియమించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఇసుక వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనుంది. రొయ్యలు, చేపల మేత నాణ్యత నియంత్రణకు చట్టం చేయాలని నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన   సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య విలేకర్లకు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటయ్యే కమిటీ ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సంఖ్యను 25 లేదా 26కి పెంచేందుకు అవసరమైన విధివిధానాల్ని రూపొందిస్తుంది.