‘సంజూ’ కి ఐదేళ్ల జైలు !

sanjaydatt-gets-5years-jailసంచలానాత్మక 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల ఘటనలో సుప్రీం కోర్టు ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు షాక్ ఇచ్చింది. ఇదివరకే ఈ కేసులో టాడా చట్టం క్రింద అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన సంజూబాబాకు ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ.. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇప్పటికే సంజయ్ దత్ ఒకటిన్నర సంవత్సర కాలం జైలు శిక్షను అనుభవించియున్న నేపథ్యంలో.. ఆ కాలాన్ని కూడా పరిగణిస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. అంటే తను మరో 42 నెలలు జైలు గోడల వెనక గడపాల్సి ఉంటుందని అర్థం.

సంజయ్ దత్ జైలుకు వెళ్ళాల్సిరావడంతో.. బాలీవుడ్ లో దాదాపుగా 70కోట్ల బిజినెస్ డోలాయమానంలో పడనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సంజయ్ పోలీస్ గిరి, పీ.కేలతో పాటు జంజీర్ తో కలిపి మూడు సినిమాలలో నటిస్తూ.. బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తాను జైలుకు వెళితే ఆ మూడు ప్రాజెక్టులు మూడున్నర సంవత్సరాలు ఆగిపోవాల్సిరావచ్చని సినీ పండితుల అంచనా.