సమంతాకు షాకిచ్చిన పాల పాప !

tamanna samanthaభారీ చిత్రాల నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తన తనయుడు శ్రీనివాస్‌ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తన తనయుడిని భారీగా లాంఛ్‌ చెయ్యాలన్న తపనతో ఈ చిత్రం కోసం ఇప్పటికే దర్శకుడిగా స్టార్‌ డైరెక్టర్‌ వివి వినాయక్‌ కు దర్శకత్వ బాధ్యతలు, యువ సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్‌ కు సంగీత బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అలాగే తన సరసన లక్కీగాళ్‌ సమంతాను రెండుకోట్ల భారీ పారితోషకం ఇచ్చి ఓకే చేసుకున్నట్లుగా కూడా ఇప్పటికే తెలిసిన విషయం. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ చిత్రంలో తమన్నా కూడా నటించబోతుంది, తనకూ దాదాపుగా 1.5 కోట్ల పారితోషికం సురేశ్‌ ఆఫర్‌ చేశాడు అన్న వార్తలొచ్చాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో సమంతాకు పాల పాప తమన్నా షాక్‌ ఇస్తోందట. కారణాలేమిటో ఇంకా తెలియకపోయినా బెల్లంకొండ ఈ ప్రాజెక్ట్‌ నుండి సమంతాను తప్పించు ఇప్పుడు తమన్నా ను తీసుకున్నట్టు తెలిసింది. ఇంతకీ లక్కీగాళ్‌ గా పేరు తెచ్చుకున్న సమంతాకు జబర్దస్త్‌ దురదృష్టాన్ని పరిచయం చేస్తోంది అనుకోవాలా?