నెల్లూరు ఆర్టీసీలో కరోనా కలకలం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరు ఆర్టీసీ లో కరోనా పంజా విసిరింది. డిపో మేనేజర్ తో పాటు మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్..అని తేలింది. అంతకుముందు కూడా ఆర్టీసీ లో ఇద్దరి ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. దీంతో మిగతా సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

తమకు రక్షణ కిట్స్ లేకుండా డ్యూటీలకు వెళ్లబోమంటూ బస్సులు నిలిపివేశారు డ్రైవర్లు. డిపో ఎదుట ఆందోళనకు దిగారు. తమ జీవితాల్ని రిస్క్‌లో పెట్టి డ్యూటీలు చేయలేమని తెగేసి చెబుతున్నారు.కేవలం ఆర్టీసీ లోనే కాదు జీజీహెచ్ లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, వైద్యసిబ్బందికి కరోనా సోకింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ముగ్గురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇద్దరు డాక్టర్లు.. నలుగురు హౌస్ సర్జన్లు,. ముగ్గురు స్టాఫ్ నర్సులు,ఓ టెక్నీషియన్ కు కరోనా బారిన పడ్డారు. దీంతో నెల్లూరు ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.