భాస్కర్‌రావు హత్య : నిందితులను పట్టుకున్న పోలీసులు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, నాని ముఖ్య అనుచరుడు మేకా భాస్కర్‌రావు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మున్సిపల్‌ చేపల మార్కెట్‌లో ఉన్న భాస్కర్‌రావును దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. అయితే దుండగులు పక్కా ప్లాన్‌తో సైనేడ్‌ పూసిన కత్తితో భాస్కర్‌ రావును హత్య చేసినట్లుగా తేలింది.

ఈ హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసారు. నిందితులు ఏ 1 కిషోర్ ,ఏ 2 పులి, ఏ 3 చిన్నలను అదుపులోకి తీసుకున్నారు. హత్యకీ గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా, హత్యను ప్రత్యక్షంగా చూసిన సాక్షుల ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసారు. ఇక మంగళవారం జరిగిన ఆయన అంత్యక్రియలకు పేర్ని నాని, అవనిగడ్డ ఎమ్మెల్యే హాజరయ్యారు. వైసీపీ నేత హత్యతో మచిలీపట్నం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భాస్కర్ రావుపై దాడి చేసి చంపిన నిందితుల ఇళ్లపై ఆయన అనుచరులు, బంధువులు దాడిచేసి ఫర్నిచర్ ను తగలబెట్టారు.