తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విపరీతం అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో నమోదు అవుతున్న కేసులు నగర వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు వెయ్యికి దగ్గరలో కేసులు నమోదు అవుతుండడం తో హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్.. కరోనావైరస్తో హైదరాబాద్‌లో కోటి మందికి భయం పట్టుకుందన్న ఆయన.. దినసరి కూలీలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠి, ఫీవర్ ఆస్పత్రుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్న అంజన్‌కుమార్.. వెంటిలేటర్లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. కరోనా వారియర్స్ కి కూడా రక్షణ లేదు.. అందుకే వారు కూడా కరోనాబారిన పడుతున్నారని.. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ కేసీఆర్.. ప్రజలను మాటలతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు.