విశాఖ నగరాన్ని వరుస గ్యాస్ లీక్ ఘటనలు నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీలోని సైనారా కెమికల్స్‌లో రియాక్టర్ నుంచి రసాయన వాయువు లీక్ కావడంతో ఇద్దరు మరణించారు. నలుగురు చికిత్స పొందుతున్నారు. మృతులను షిప్ట్ ఇన్‌చార్జి నరేంద్ర, గౌరీశంకర్‌గా గుర్తించారు.
నరేందర్ గుంటూరు జిల్లా తెనాలికి చెందినవాడు కాగా.. గౌరీ శంకర్ విజయనగరం వాసి. అస్వస్థతకు గురైన ఎల్వీ చంద్ర శేఖర్, పి.ఆనంద్ బాబు, డి.జానకీ రామ్, ఎం.సూర్యనారాయణలుగా గుర్తించారు.
ప్రమాద సమాచారం తెలుసుకున్న కలెక్టర్ వినయ్ చంద్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.