తెలంగాణ లో ఒకేరోజు వెయ్యి దాటినా కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో అంత అనుకున్నట్లే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు వందలలో ఉన్నకేసులు శనివారం వెయ్యి కేసులకు చేరాయి. తెలంగాణ వైద్య‌,ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. రాష్ట్రవ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 1,087 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

Also Read :  Heat Stroke : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వడదెబ్బతో మరణిస్తే రూ. 4 లక్షలు

తెలంగాణలో ఒకేరోజు వెయ్యి కేసులు దాటిపోవ‌డం ఇదేతొలిసారి కాగా.. కేవ‌లం హైద‌రాబాద్‌లోనే 888 క‌రోనా కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 74, మేడ్చ‌ల్‌లో 37 కేసులు న‌మెదు అయ్యాయి. మ‌రోవైపు ఒకే రోజు కొత్త‌గా ఆరుగురు క‌రోనాబారిన‌ప‌డి మృతిచెందారు. గ‌త 24 గంట‌ల్లో 3,923 శాంపిల్స్ ప‌రిశీలిస్తే.. 1,087 క‌రోనా కేసులు నిర్ధార‌ణ కావ‌డం ప్రజలందరిని ఆందోళనలో పడేస్తున్నాయి.

Also Read :  పాక్ క్రికెటర్లకు భారత్ గట్టి షాక్: యూట్యూబ్‌లో నిషేధం