తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు వందల కేసులు పెరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ కరోనా టెస్ట్‌లు, ట్రీట్మెంట్ ల బాధ్యత ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆస్పత్రులకు కూడా అప్పగించింది తెలంగాణ సర్కార్.
టెస్ట్, ట్రీట్మెంట్కు ధరలు నిర్ణయించడంతో పాటు.. మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అయితే.. ప్రైవేట్ లాబ్స్ టెస్టింగ్ లో అవకతవకలకు పాల్పడుతున్నాయని మీడియా బులెటిటన్లో పేర్కొంది. 48 గంటల్లో లోపాలు సరిదిద్దుకోక పోతే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించింది.
తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టీమ్స్) పై సమీక్ష సమావేశం నిర్వహించిన ఈటల… టిమ్స్‌లో ఐపీ సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి కావొచ్చినట్టు తెలిపారు.. సోమవారం నుండి వైద్యులు, సిబ్బంది విధుల్లోకి వస్తారని.. 499 పోస్టులకు 13వేల అప్లికేషన్లు వచ్చినట్టు వెల్లడించారు. ప్రైవేట్ ల్యాబ్‌ల పని తీరుపై వైద్య ఆరోగ్య శాఖ నియమించిన కమిటీ చేసిన తనిఖీల్లో మార్గ దర్శకాలు పాటించకుండా పరీక్షలు చేస్తున్న పలు ల్యాబ్‌లను గుర్తించామన్నారు.