కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో కరోనా ఉదృతి రోజు రోజుకు పెరుగుతుంది..రాజకీయనేతలు సైతం ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయనేతలు దీని బారిన పడగా..తాజాగా కర్నూలు జిల్లాలోని కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు గురువారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎమ్మెల్యే సుధాకర్ గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, నీరసంతో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.

అయితే కోవిడ్ లక్షణాలు ఉండటంతో.. కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఈ పరీక్షల్లో ఆయనికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో కె.నాగలాపురం దగ్గర ఉన్న విశ్వభారతి ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు ఎమ్మెల్యేని తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యేకు కరోనా రావడంతో ఆయనతో కాంటాక్ట్ అయిన కుటుంబ సభ్యులకు, పలువురికి కూడా వైద్యులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు