ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా పదవి చేపట్టిన దగ్గరి నుండి అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తూ ప్రజల మన్నలను పొందుతున్న జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో పధకానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ‘వైఎస్ఆర్ నేతన్న పధకం’ ద్వారా పేద నేతన్నలకు ఆర్ధిక సాయం అందించిన జగన్ ప్రభుత్వం.
కాపు మహిళలకు అండగా నిలిచేందుకు ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’కు శ్రీకారం చుట్టింది. ఈ పధకం ద్వారా కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన మహిళలకు ఏటా రూ. 15 వేల చొప్పున ఐదేళ్ళకు రూ. 75 వేలు ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. రేపు (జూన్ 24) సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ఈ పధకాన్ని ప్రారంభించనున్నారు. 45-60 ఏళ్ల వయసున్న మహిళలకు ఆర్ధికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ సాయం చేస్తుండగా.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.36 లక్షల మహిళలకు రేపు వారి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.