తెలంగాణా రాష్ట్ర ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ రిజల్స్ రేపు ప్రకటించబోతుంది ఇంటర్ బోర్డు . ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఫలితాల విడుదల కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇదిలా ఉండగా ఏపీలో ఇంటర్ ఫలితాలు ఇప్పటికే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో పదవ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేస్తే అక్కడ మాత్రం నిర్వహించాలనుకుంటోంది ఏపీ గవర్నమెంట్. షెడ్యూల్ ప్రకారం జులైలో పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి సురేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.