కింగ్ నాగార్జున ఆస్తులు భారీగా పెరిగినట్లు సమాచారం. సినిమాల పరంగా పెద్దగా హిట్స్ కొట్టలేకపోయిన..సంపాదన విషయంలో మాత్రం గట్టిగానే సంపాదిస్తున్నాడు. గతేడాది బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంతకు ముందు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ రియాలిటీ షోస్‌లో నటించేందకు నాగార్జునకు స్టార్ మా భారీగానే పారితోషకం ముట్ట జెప్పింది.
దీంతో నాగార్జున ఆస్తులు ఒక్కసారిగా పెరగినట్టు సమాచారం. చేతి నిండా డబ్బులు ఉండటంతో నాగార్జున ఇపుడు సొంత చార్టెట్ ఫ్లైట్‌ను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు తాను వాడుకోని సందర్భాల్లో ఈ ఛార్టెట్ ఫ్లైట్‌ను అద్దెకు ఇచ్చే ఆలోచనలో నాగార్జున ఉన్నట్టు సమాచారం.