తెలుగు రాష్ట్రాలు ముద్దయ్యాయి..

మొన్నటి వరకు ఎండతో తీవ్ర ఇబ్బంది పద్దైన తెలుగు రాష్ట్రాల ప్రజలు కాస్త చల్లబడ్డారు. బుధువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షం కురిసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. గాలి దుమారం, ఉరుములు, మెరుపులతో వానలు పడ్డాయి. హైదరాబాద్‌లో భారీ వర్షం కురవడంతో పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరింది. అటు.. రైతన్నల మోములో ఆనందం వెల్లివిరిసింది. పలు ప్రాంతాల్లో దుక్కులు దున్నగా, మరికొన్న చోట్ల వితన్నాలు చల్లారు. ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడింది. వాగులు, చెరువులు, కుంటలు నిండుగా కనిపించాయి.