బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో చంద్రబాబు

నందమూరి నటసింహ బాలకృష్ణ ఈరోజు 60 వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భాంగా కుటుంబ సభ్యులు , సన్నిహితులు , సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక బాలకృష్ణ 60 వ పుట్టిన రోజు వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాలుపంచుకున్నారు. కేక్ ను తినిపించి బాలయ్య ను మైమరపించారు. ఈ వేడుకల్లో బాలకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు. వాటి తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.