శశి ప్రీతమ్‌ క్షేమం..

సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్‌ గుండెపోటు తో హాస్పటల్ లో జాయిన్ అయినా సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన క్షేమంగా ఉన్నట్లు స్వయంగా ఆయనే తెలిపారు. గుండెపోటు రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్‌మీడియాలో అనేక వార్తలు వినిపించాయి. ఈ పుకార్లపై స్పందించిన శశిప్రీతమ్‌ ఓ వీడియోను విడుదలచేశారు.

ఆయన మాట్లాడుతూ ‘ఈ నెల 4వ తేదీ ఉదయం నాకు గుండెపోటు వచ్చింది. నా స్నేహితుడు రాజు నన్ను బంజారాహిల్స్‌లోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. గుండెలో బ్లాక్‌ ఉండటంతో డాక్టర్లు యాంజియోప్లాస్టి చేశారు. ఒక స్టంట్‌ వేసి హార్డ్‌ ఎటాక్‌ సమస్య నుంచి నన్ను కాపాడారు. మంగళవారం హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ కానున్నాను. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నా’ అని అన్నారు.