ఎందుకీ ఖర్మ ?

వద్దంటూ గోల పెరిగె
డబ్బింగూ సీరియళ్ళు !
కుదరదు పో పోమ్మంటూ
మొండికేసె చానెళ్ళూ !!

పొట్టకొట్ట వద్దంటూ
ఆర్టిస్టుల ఆవేదన !
అవే మాకు బెటరంటూ
శాటిలైట్ల ఆరాధన !!

నేటివిటీ పోతోందని
ఎంతగ మొరపెట్టుకున్న !
చెవిటి ముందు శంఖమంట
ఫలితం ఓ నిండుసున్న !!

పలుకు వేరు పెదవి వేరు
ముఖమేమో పక్కవూరు !
మనవాళ్ళే లేరా ఇట
ఎందుకయ్యా ఈ పోరు !!

– ఏవీయస్