నందమూరి బాలకృష్ణ జూన్ 10 న 60 వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అలాగే ఈసారి పుట్టిన రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అది బాలయ్య షష్ఠిపూర్తి కావడం. దీంతో ఈ ఈవెంట్ ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది నందమూరి కుటుంబం. ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఫ్యాన్స్ ఆత్రుత కనబరుస్తున్నారు. బాలయ్య తన నివాసంలో ఓ భారీ విందు ఏర్పాటు చేయనున్నారని ఈ విందులో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొంటారని సమాచారం.
ఇదిలా ఉంటె బాలయ్య బర్త్ డేని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తారా లేదా? జూన్ 10 సస్పెన్స్ కి తెర దించుతారా లేదా? అన్న చర్చా మెగా ఫ్యాన్స్ లో వేడెక్కిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా చిరంజీవి తో పాటు మరికొంతమంది సినీ పెద్దలు కేసీఆర్ ను కలవడం పట్ల బాలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇండస్ట్రీ లో పెద్ద చర్చే జరిగింది. మరి ఇప్పుడు చిరు ,..బాలయ్య కు విషెష్ తెలిపి వివాదానికి తెరదింపుతారో చూడాలి.