కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డ రేవంత్


కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జన్ వాడలో కేటీఆర్ అక్రమంగా ఫాంహౌస్ కడుతున్న మాట వాస్తవమేనని రేవంత్ పునరుద్ఘాటించారు.”ఇవాళ నీ కొడుకు చేసిన అక్రమాలపై తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి’ అంటూ సీఎం కేసీఆర్ నిలదీశారు.

‘నువ్వూ, నీ కొడుకు కల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజల్ని బలిచేసి విలాసవంతమైన ఫాంహౌస్ లు నిర్మించుకుని పత్తిత్తుల్లాగ మాట్లాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు.

“ముందు నా భూమి ఉన్న వట్టినాగులపల్లి వెళదాం. మీరు చెబుతున్న భవనమో, భవంతో ఉందన్నారు కదా. జేసీబీ నేనే నడుపుతా. అక్కడేదైనా అక్రమ నిర్మాణం ఉందంటే నేనే కూలగొడతా. ఆ తర్వాత నీ భూమి ఉన్న జన్ వాడ వెళదాం. మనిద్దరం ప్రజల ముందు పరీక్షకు నిలబడదాం” అంటూ సవాల్ విసిరారు.