సమంత కు ఏం చేయాలనిపిస్తుందో తెలుసా..?

లాక్ డౌన్ వేళ సినీ తారలకు ఫుల్ రెస్ట్ దొరికింది. దీంతో వారంతా ఇంటికే పరిమితమయ్యారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా లాక్ డౌన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సమంత మాత్రం ఎంతో విలువైన అర్థవంతమైన పనిని నేర్చుకుంది. చాలా మంది భర్తలతో వంట చేయించాలనుకుంటారు. కానీ సామ్ మాత్రం తానే వండి రుచికరమైన వంటకాల్ని చైతూకి తినిపించాలనుకుంటోంది.

అందుకే ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుందట. ఆ సంగతిని తన ఇన్ స్టా తెలిపింది. సామ్ నగరంలోని ప్రసిద్ధ ఆహార నిపుణుడిని తన కోచ్ గా నియమించుకుంది. ఆరోగ్యకరమైన జీవనం కోసం కొన్ని ప్రత్యేక వంటకాలను నేర్చుకోవడమే గాక… కొన్ని సూప్ ల తయారీ నేర్చుకుందట.