లాక్ డౌన్ కారణంగా చాలామంది సినీ స్టార్స్ సోషల్ మీడియా లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ వస్తుంటే..మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ మాత్రం సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపి షాక్ ఇచ్చాడు.
ఈ మేరకు ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేసిన ఉన్ని ముకుందన్.. ”హాయ్ ఫ్రెండ్స్. నా అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైదొలుగుతున్నా. నా తదుపరి సినిమా ‘మెప్పాడియన్’ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. టీమ్ ఉన్ని ముకుందన్ నా తదుపరి సినిమాల గురించి సమాచారాన్ని ఇస్తుంది. మిమ్మల్ని సినిమా థియేటర్లో కలుసుకుంటా. థ్యాంక్యు” అని రాసుకొచ్చారు. అయితే ఆయన శాశ్వతంగా సోషల్ మీడియా నుంచి వైదొలిగారా లేక కొద్ది రోజుల తరువాత మళ్లీ ఎంట్రీ ఇస్తారా..? అన్న విషయం మాత్రం తెలీదు.