తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం తో…మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,650కి చేరింది. అలాగే కరోనాతో 14 మంది మృతిచెందగా..రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 137కు చేరింది.
ప్రస్తుతం వివిధ ఆస్పత్రులలో 1,771 మంది చికిత్స పొందుతుండగా… ఇప్పటివరకూ 1,742 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మరో 132 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించగా..జియాగుడా, అంబర్ పేట, ఖైరతబాద్ లో ఎక్కువ కేస్ లు నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఇక ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినపడి మృతి చెందినవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 4లక్షల మార్కును దాటింది. ఇందులో నాలుగోవంతు మరణాలు ఒక్క అమెరికాలోనే ఉన్నాయి. ప్రస్తుతం 70,13,965 కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అయ్యాయి. మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,02,756కు చేరింది.