ఎన్టీఆర్ ను ప్రతినాయకుడి గా చూపించబోతున్నాడా..?

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ..బాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ , అజయ్ దేవగన్ తో పాటు హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ బ్రేక్ పడింది.

ఇదిలా ఉంటె ఈ మూవీ లో ఎన్టీఆర్ను సరికొత్తగా చూపించేందుకు రాజమౌళి అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని టాక్. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిపేసి ఇళ్లకే పరిమితమయ్యారు రాజమౌళి టీమ్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ప్రతినాయకుడి ఛాయలు కనిపిస్తాయని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ సాధారణంగా ఇంకొన్ని సన్నివేశాల్లో కండలు తిరిగిన దేహంతో ఉంటాడట. అందుకోసం తారక్ తన బాడీని మేకోవర్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయితే మొదటగా ఎన్టీఆర్ తో భారీ ఫైట్స్ ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి.