శనివారం నాడు మూవీ మొఘల్ డి. రామరానాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భాంగా తాతయ్య రామానాయుడు బతికుంటే తనకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదని దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కుమారుడు అభిరామ్ మీడియా తో అన్నారు. తాతే ఉండుంటే తాను హీరో అయ్యేవాడినని, తనకు ఎంతో సపోర్ట్ ఉండేదని..తాను తాతను ఎంతో మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చారు.
భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ… మానసికంగా ఆయన తనకు దగ్గరగా ఉన్నారనేది తన ఫీలింగ్ అని చెప్పాడు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నాడు. తాతయ్య జయంతి సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.