ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీని ఫిక్స్ చేసారు. జూన్ 16 నుండి ఈ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం మార్చిలో ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సభ ప్రారంభం అవుతుందని తెలుస్తుండగా, 18న బడ్జెట్ సభ ముందుకు రానుందని సమాచారం.
సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమై. సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయనుంది.