ప్రస్తుతం కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో ఉందొ చెప్పాల్సిన పనిలేదు. అమెరికా కేసులను సైతం ఇండియా దాటివేసి వార్తల్లో నిలుస్తుంది. ఇలాంటి టైంలో అతి తక్కువ ధరలో నిమిషాల్లో ఫలితాలనిచ్చే కరోనా టెస్టింగ్ కిట్ ను తయారుచేసారు హైదరాబాద్ ఐఐటీ.
పీసీఆర్ (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలీమెర్స్ చైన్ రియాక్షన్)కు ప్రత్యామ్నాయ విధానమని ఐఐటీ రీసెర్చర్లు ఈ కిట్ కు సంబందించిన వివరాలను వెల్లడించారు. టెస్టింగ్ కిట్ ధర రూ.550 కాగా ఈ కిట్ తో కేవలం 20నిమిషాల్లోనే రిసల్ట్స్ వస్తాయని.. టెస్టింగ్ కిట్లకు సంబంధించిన పరీక్షలకు ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో పరీక్షించామని, పరీక్షల్లో విజయవంతం అయిన తరువాత ఐసీఎంఆర్ అనుమతుల కోసం వేచి చూస్తున్నామని ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ తెలియజేశారు. ఈ కిట్ ను తయారు చేయడానికి రూ.550 ఖర్చు అయ్యిందని ఎక్కువ మొత్తంలో కిట్లను తయారు చేస్తే రూ.350 కే తయారు చేయవచ్చని తెలిపారు.