హైదరాబాద్ లో సిటీ బస్సులు ఇప్పట్లో తిరగడం కష్టమే..

లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ సిటీ బస్సులు డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. తాజాగా లాక్ డౌన్ సడలింపులో భాగంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం తో సిటీ బస్సులు కూడా తిరగవచ్చని మొన్నటి వరకు నగర వాసులు అనుకున్నారు. కానీ ప్రస్తుతం బస్సులు రోడ్డెక్కే పరిస్థితి లేదని మంత్రి పువ్వాడ అజయ్ క్లారిటీ ఇచ్చారు.

ఆర్టీసీ యాజమాన్యం నుంచీ బస్సులు నడిపేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కాకపోతే… కరోనా కేసుల్లో GHMC పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు బస్సుల్ని అనుమతిస్తే… సిటీలో సోషల్ డిస్టాన్స్ సాధ్యమవుతుందా? ప్రయాణికుల్ని కంట్రోల్ చెయ్యగలమా? సీట్లలో కూర్చొని మాత్రమే ప్రయాణించేలా చెయ్యగలమా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందువల్ల… హైదరాబాద్‌లో కరోనా కేసులు తగ్గాకే… సిటీ బస్సులు నడుపుతామని మంత్రి తెలిపారు.