ముఖ్యమంత్రి పక్కన మొత్తం కరోనానే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు కేసులు విపరీతం అవుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి నివాసాన్ని సైతం కరోనా వదిలిపెట్టడం లేదు. జగన్ నివాసం ఉండే సమీపంలో క్రిస్టియన్ పేట, ఎన్టీఆర్ కట్టపై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లే దారిలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ ఎత్తున శానిటైజేషన్ చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ క్లీన్ చేస్తున్నారు. అయినప్పటికీ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.