మహేష్ దెబ్బ కు నిర్మాత ఫోన్ నెం చేంజ్ చేసాడు..

గుణశేఖర్ – మహేష్ బాబు కలయికలో వచ్చిన ఒక్కడు చిత్రం ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో తెలియంది కాదు. ఈ సినిమా మహేష్ కెరియర్ నే పూర్తి గా మార్చేసింది. ఈ చిత్రంలోని పాటలు , లొకేషన్స్ , కబడ్డీ గేమ్ , ప్రకాష్ రాజ్ – మహేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఇలా అన్ని కూడా ప్రేక్షకులను కట్టిపడేశాయి.

కాగా ఈ మూవీ లో ధర్మవరపు సుబ్రమణ్యం – మహేష్ ల మధ్య ఫోన్ సంభాషణ సన్నివేశం ఎంతగా నవ్వించిందో తెలియంది కాదు. భూమిక పాస్ పోర్ట్ కోసం, పాస్ పోర్ట్ ఆఫీసర్ సుబ్రమణ్యం దగ్గరకు మహేష్ గ్యాంగ్ వస్తారు. పాస్ పోర్ట్ చేతికి ఇవ్వడం కుదరదు అన్న ఆయన అదే సమయంలో… ఆయన కొత్తగా కొన్న ఫోన్ కి లవర్ మొదటి కాల్ చేయాలని, రొమాంటిక్ గా తన ఫోన్ నంబర్ చెవుతాడు. చేతికి పాస్ పోర్ట్ ఇవ్వడం కుదరదు అన్న సుబ్రమణ్యాన్ని ట్రిక్ లో పడేయాలని మహేష్ గ్యాంగ్ ఆయన కొత్త సెల్ ఫోన్ కి కాల్స్ చేసి ఆడుకుంటారు. ప్రతి సారి తన లవర్ ఫోన్ చేసిందని ఫోన్ ఎత్తి, రాంగ్ కాల్స్ తో విసిగిపోయిన సుబ్రహ్మణ్యం ఫోన్ బద్దలు కొడతాడు.

ఆ సన్నివేశంలో సుబ్రమణ్యం రొమాంటిక్ గా చెప్పిన ఫోన్ నంబర్ ఆ చిత్ర నిర్మాత ఎం ఎస్ రాజు గారిది అట. ఒక్కడు విడుదల తర్వాత ఆయనకు రోజుకు అనేకమంది కాల్స్ చేస్తూ ఉండేవారట. దీనితో చేసేదేమీ లేక ఆయన తన ఫోన్ నంబర్ మార్చుకున్నారట.